శ్రీశైలం గేట్లు ఎత్తివేత..

25
srisailam
- Advertisement -

భారీ వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో ఇవాళ ఉదయం మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అ​​ంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది.కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -