శ్రీశైలంకు పెరిగిన వరద ఉధృతి

7
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. జలాశయం 10 రేడియల్ క్రెస్టు గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు అధికారులు.

ఇన్ ఫ్లో 5,40,756 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,86,440 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 199.7534 టీఎంసీలు.కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read:ఎమ్మెల్యే హరీశ్ బాబు…సత్యాగ్రహ దీక్ష

- Advertisement -