శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీగా ఇన్ ప్లో వస్తుండటంతో దాదాపుగా పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి వేశారు. తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గేట్లను ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు.
ఇప్పటికే కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా పూర్తి స్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. గేట్లు కూడా ఎత్తడంతో భారీ స్దాయిలో సాగర్ కు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు గేట్లను ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టును చూడడానికి చాలా మంది అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఏపీలో చాల ప్రాంతాలు జలమయం కావడంతో నీటిని విడుదల చేశారు.