శ్రీ‌రంగ‌నీతులు ట్రైల‌ర్ విడుద‌ల

26
- Advertisement -

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్ర‌యిల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో అజ‌య్ అర‌సాడ‌, శ‌శాంక్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి, రుహాని శ‌ర్మ‌, ప్ర‌వీణ్‌కుమార్, విరాజ్ అశ్విన్‌, కార్తీక్ రత్నం, సుహాస్, కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి మాట్లాడుతూ, చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ నా స్నేహితుడు, ద‌ర్శ‌కుడు అన్ని విభాగాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. మంచి అవుట్ ఇచ్చాడు. చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు అజ‌య్ అర‌సాడ మాట్లాడుతూ శ్రీ‌రంగ‌నీతులు చిత్రం క్లోజ్ టు మైహార్ట్‌. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ నాకు అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ఇది అంద‌రికి న‌చ్చే సినిమా. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు.కార్తీక్ ర‌త్నం మాట్లాడుతూ నాకు న‌చ్చిన పాత్ర‌ను ఇందులో చేశాను. నాకు న‌చ్చిన ఆర్టిస్టుల‌తో ప‌నిచేశాను. సినిమా చాలా బాగుంది. అంద‌రూ థియేటర్‌లో త‌ప్ప‌కుండా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

రుహాని శ‌ర్మ మాట్లాడుతూ చాలా రోజులుగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నేను న‌టించినందుకు హ్య‌పీగా వుంది. ఇది అంద‌రిక‌థ. అన్ని పాత్ర‌ల‌తో అంద‌రూ క‌నెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్న‌ప్పుడు చాలా మంది వాళ్ల‌ను వాళ్లు అద్దంలో చూసుకంటున్న‌ట్లుగా వుంటుంది. ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌. ఇలాంటి సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయి అన్నారు.

Also Read:KTR:ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే

- Advertisement -