సీతారామచంద్రమూర్తులను హిందువుల ఇలవేల్పుగా, ఆరాధ్య దైవాలుగా కొలుచుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామ నవమి ఒక ప్రత్యేక సందర్భం అని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, వైభవోపేతంగా నిర్వహిస్తుందన్నారు. యావత్ భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భద్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం మంజూరు చేశారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి…