శ్రీను వైట్ల కష్టాలు ఇన్ని అన్ని కావు

29
- Advertisement -

వరుసగా అరి వీర భయంకరమైన డిజాస్టర్లు ఇవ్వడంతో ‘దర్శకుడు శ్రీను వైట్ల’ను చాలా కాలంగా అష్టా కష్టాలు చుట్టు ముట్టాయి. కానీ, మళ్లీ హిట్ సినిమా తీసి, ఫామ్ లోకి రాయడం అంత వీజీ కాదు. ఎందుకంటే, ఒక ప్లాప్ దర్శకుడికి తన సినిమాని పూర్తి చేయడానికి, అలాగే విడుదల చేయడానికి ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలియదు. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల, ఎంతో కష్టపడి హీరో గోపీచంద్ డేట్లు సంపాదించుకున్నాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. కానీ, సినిమా మాత్రం ఆగుతూ సాగుతూ ఉంది.

ముఖ్యంగా శ్రీను వైట్ల – గోపీచంద్ సినిమాకు ఫండింగ్ దొరకడం సమస్యగా వుందని తెలుస్తోంది. అదే సమయంలో నాన్ థియేటర్ హక్కులు అమ్ముడు కావడం కూడా కష్టంగా వుంది. అడియో రైట్స్ మాత్రం అమ్ముడయిపోయాయి. నిజానికి శ్రీను వైట్ల సినిమా చేస్తానంటే ఐదేళ్ల క్రితం వరకూ చాలా మంది నిర్మాతలు రెడీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. పైగా నిర్మాణం బాధ్యతలు తానే చేయాలి అంటారు శ్రీనువైట్ల. దానికి చాలా మంది అంగీకరించరు. అందువల్ల దొరికిన నిర్మాతతో శ్రీనువైట్ల ముందుకు వెళ్ళాడు.

కానీ, షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. ఇప్పటికి హీరో గోపీచంద్ కు సంబంధించి ఒకటికి రెండు సార్లు షెడ్యూళ్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి శ్రీను వైట్ల – గోపీచంద్ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అనేది క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు ఈ సినిమాకి ఫైనాన్స్ కష్టాలు అన్నది పాత విషయమని అంటున్నారు.

Also Read:పిక్ టాక్ : అందాల దుకాణం ఓపెన్‌ చేసింది

- Advertisement -