‘శ్రీనివాస కల్యాణం’ మూవీ మేకింగ్‌ వీడియో..

226
- Advertisement -

టాలీవుడ్‌ హీరో నితిన్‌, బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’.ఈ సినిమాను సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ మూవీలో నందితా శ్వేత మరో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌లను ఇటీవల విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు చిత్ర యూనిట్.

Srinivasa Kalyanam Movie

ఇక ఈ వీడియోలో ఇంట్లో జరుగుతున్న పెళ్లికి పెద్దలు, పిల్లలు చేసే సందడంతా చూపించారు. అయితే ఇది సినిమాలా కాకుండా నిజంగానే పెళ్లి జరిపిస్తున్నట్లుగా చాలా అందంగా తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణలో దాదాపు 60 మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నట్లు వీడియోలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని పేరున్న సెలబ్రిటీలందరూ ఈ సినిమాలోనే ఉన్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -