టాలీవుడ్ లో స్నేహం గురించి చెప్పాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో తారక్ కు చాలామంది స్నేహితులున్నారు. తారక్ క్లోజ్ ఫ్రెండ్స్ లో నటుడు రాజీవ్ కనకాల ఒకరు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ఈ జాబితాలో ఉన్నా.. చాలా రోజులుగా ఎన్టీఆర్ కు ఆయనకు మధ్య దూరం పెరిగింది. 2009లో ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేస్తుండగా.. జరిగిన ప్రమాదమే దీనికి రీజన్ అని తాజాగా శ్రీనివాసరెడ్డి ఓ ఇంటర్వ్యూలో మ్యాటర్ రివీల్ చేశాడు.
ఆ ఘటనకు ముందు వరకు ఎన్టీఆర్, శ్రీనివాసరెడ్డి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎన్టీఆర్, రాజీవ్ కనకాలతో కలిసి శ్రీనివాసరెడ్డి కూడా క్రికెట్ ఆడేవాడట. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేస్తున్నప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నాడు. ఖమ్మంలో ఎన్టీఆర్ ప్రచారం నిర్వహిస్తుండగా..శ్రీనివాసరెడ్డి ప్రచారంలో జాయిన్ అయ్యాడు. సభ ముగిసిన తర్వాత అందరు కలిసి కార్లలో హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. ముందు వెళ్తున్న కారులో ఎన్టీయార్, మరికొంత మంది స్నేహితులు… వెనుక మరో కార్లో శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత ఎన్టీయార్ కార్‌కు యాక్సిడెంట్ అయింది. ఆ తరువాత ఎన్టీఆర్ ను ఆసుపత్రి తీసుకు రావడం, ఆయన క్షేమంగా గాయాలనుంచి కోలుకోవడం అంతా జరిగిపోయాయి. అయితే ఈ యాక్సిడెంట్ టైమ్ లో ఓ వ్యక్తి శ్రీనివాసరెడ్డి తో “నువ్వు అడుగు పెట్టావు. యాక్సిడెంట్ అయింది” అని అన్నాడట. దీంతో శ్రీనివాసరెడ్డి బాధపడిపోయాడట.
వెంటనే నేను ఉన్నాను కాబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇంకేమయ్యేదో అంటూ కౌంటర్ ఇచ్చాడట. అయితే వాళ్లు ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు ఏమని చెప్పారో కానీ, అప్పట్నుంచి ఎన్టీఆర్ దూరమయ్యాడు అంటున్నాడు శ్రీనివాసరెడ్డి. ఇది జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా మా మధ్య గ్యాప్ అలాగే ఉండిపోయింది. అయితే ఏదో ఒకరోజు ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడుతానని చెబుతున్నాడు శ్రీనివాస రెడ్డి.