అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్‌:మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

366
srinivas goud
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రగతి ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ గా ఉన్నప్పుడే తెలంగాణ సాధించారని చెప్పారు.

మహబూబ్ నగర్ తాగునీటి కష్టాలు దూరం చేశామని…మహాబుబ్ నగర్ – జడ్చర్ల రహదారి పై వందల మంది ప్రాణాలు కోల్పోయారు..ఇవాళ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

మహాబుబ్ నగర్ అభివృద్ధి కి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని…గత పాలకులు లక్షల మంది వలసలు పోయినా జిల్లా ను పట్టించుకోలేదన్నారు. మహబూబ్ నగర్ రూపురేఖలు మారుస్తున్నామని….దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -