బీఆర్ఎస్‌ లేకపోతే తెలంగాణ వచ్చేదా?

14
- Advertisement -

పార్టీ మారుతున్న వారు బీ ఆర్ ఎస్ నాయకత్వం పై విమర్శలు చేయడం సరికాదు అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్……బీ ఆర్ ఎస్ కు కేసీఆర్ కు జై కొట్టిన వారు ఇపుడు పార్టీ యే ఉండదన్నట్టు మాట్లాడుతున్నారు అన్నారు. పార్టీ ని లేకుండా చేయడం ఎవరి తరం కాదు..ప్రజలు నిర్ణయించాలి తప్ప కొందరు ఎమ్మెల్యేలో నాయకులు కాదు అన్నారు.

రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇపుడు ఏ స్థాయికి చేరుకుంది ?,..కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారం లోకి రాలేదా ? అని ప్రశ్నించారు. మా పార్టీ కి గొప్ప ఉద్యమ చరిత్ర ఉంది…..త్యాగాల పునాదుల మీద బీ ఆర్ ఎస్ పుట్టిందన్నారు. సమయం వచ్చినపుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన చరిత్ర బీ ఆర్ ఎస్ ది ..పార్టీ మారే వారు తొందర పడుతున్నారు అన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ కే కాదు ఇంకా పద్నాలుగు పార్టీ లకు సీట్లు రాలేదు..మోడీ కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీద పార్లమెంటు ఎన్నికలు జరిగాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఈ విషయాలు గమనిస్తారు…స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ..ఆ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లా ఉండవు
…ప్రజలు తెలివైన వారు .వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు. బీ ఆర్ ఎస్ కు 65 లక్షల మంది సభ్యత్వం ఉంది ..ఆషామాషీ గా తుడిచి పెట్టలేరు..బీ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారు అన్నారు. మాకు 33 జిల్లాల్లో ,ఢిల్లీ లో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి…..బీ ఆర్ ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా ?…ఈ పార్టీ పుట్టక పోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది ? అన్నారు.

Also Read:సంతోష్ శోభన్..’కపుల్ ఫ్రెండ్లీ’

- Advertisement -