లక్షలాది మంది వలసలు వెళ్లిన జిల్లా పాలమూరు అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..రాష్ట్రం లో ఏ వర్గం సంతోషంగా లేదు అన్నారు. ఇండ్లు కూల్చి వేస్తే పలకరించి నందుకు కేసు లు పెట్టారు….బాధితులకు అన్నం పెట్టినందుకు అక్కడ ఉన్నందుకు మా తమ్ముడి ని జైల్లో పెట్టారు అన్నారు.మా తమ్ముడి మీద కేసు పెడితే నోర్లు మూత పడతాయి అనుకుంటున్నారు…కేసు లకు భయపడే వాళ్ళం కాదు అన్నారు.
రాష్ట్రం లో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రం లో ప్రజలు సమస్యలు వస్తే తెలంగాణ భవన్ కి వస్తున్నారు…తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందన్నారు. హైడ్రా, మూసి బాధితులు ఇంకా వస్తున్నారు…కెసిఆర్ మీద, బి ఆర్ ఎస్ పార్టీ పై నమ్మకంతో వస్తున్నారు అన్నారు. వంద రోజుల్లో హామీ చేస్తానన్న హామీలు అమలు చేయాలి.. అరిగిపోని యంత్రం, అలసిపోనీ వ్యక్తి హరీష్ రావు అన్నారు.
రైతు రుణమాఫీ పై వాట్సాప్ ఫిర్యాదు ఆలోచన హరీష్ రావు గారిదే….ఇంట్లో దావత్ కి సర్కార్ పర్మిషన్ కావాలంట అన్నారు. దీపావళి దావత్ కి కూడా సర్కార్ పర్మిషన్ అడగాలా? అన్నారు.
Also Read: Harishrao: తగ్గిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు