అంధులు, వికలాంగులపై ప్రతాపమా?:శ్రీనివాస్ గౌడ్

8
- Advertisement -

400 మంది పోలీస్ బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అంధులు వికలాంగుల పైన చూపిస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చెరువులకు ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్లకేమో నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తారు…అంధులు, వికలాంగులు నివసిస్తున్న ఇండ్లను మాత్రం ఏ నోటీసు లేకుండా, సమాచారం ఇవ్వకుండా 400 మంది పోలీసులతో వచ్చి అర్థరాత్రి కూల్చేస్తారా అని ప్రశ్నించారు.

సమాజంలో సరైన గౌరవం లేదని చెప్పి అంధులు, వికలాంగులు ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు అన్నారు.చాలా ప్రపంచ దేశాల్లో అంధులు,వికలాంగులకు అన్ని ఫ్రీగా కట్టించి ఇస్తాయి…వారు గౌరవంగా బ్రతకాలి స్వతంత్రంగా ఉండాలని కేసీఆర్ వారికి 4,000 పెన్షన్ చేశారు అని గుర్తు చేశారు.

అంధులు, వికలాంగులు అని చూడకుండా వారి ఇండ్లను కూల్చడమంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదు అని తెలిసిపోయిందన్నారు. వికలాంగులు, అంధులు నివసిస్తున్న కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకి లాగేసి ఇళ్లను కూల్చడం బాధాకరం అన్నారు. నిన్న జరిగిన సంఘటనను మీడియా సరిగ్గా చూపిస్తే అంధులు, వికలాంగుల పట్ల భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని మన దేశానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉంటదన్నారు.

Also Read:రాజన్న ఆలయ విస్తరణపై దృష్టి: సీఎం రేవంత్

- Advertisement -