- Advertisement -
సురవరం ప్రతాపరెడ్డి సేవలు మర్చిపోలేనివని కొనియాడారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదితతో కలిసి నివాళి అర్పించారు.
తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం అందించిన సేవలు అమోఘమన్నారు. తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో సురవరం గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
సురవరం ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైన వారు కాదని అన్నారు. ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కవులే లేరని చెప్పిన రోజున 350 మందికి పైగా కవులతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు.
Also Read:టమోటాతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Advertisement -