పరిసరాలను శుభ్రంచేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

337
srinivas goud
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయము 10: 00 గంటలకు పది నిమిషాలు మీకోసం కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన స్వగృహంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరిచారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు మరియు అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పదినిమిషాల పాటు విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

మన గ్రామాలను పట్టణాలను ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైనవి మలుచుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

- Advertisement -