- Advertisement -
మహబూబ్ నగర్ ప్రధాన రోడ్డు పనులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ గారు పరిశీలించారు. మహబూబ్ నగర్ – జడ్చర్ల NH 167 పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్నారు.
అందులో భాగంగా మహబూబ్ నగర్ – జడ్చర్ల జాతీయ రహదారి పనులకు మయూరి పార్క్ వద్ద ఇటీవల అటవీ భూములను సేకరించడం జరిగింది. వాటికి 7.14 ఎకరాల కు గాను రూ. 93 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జంక్షన్ ల సుందరీకరణ జాతీయ రహదారి పూర్తి అయితే మహబూబ్ నగర్ పట్టణ రూపురేఖలు మారిపోతాయన్నారు.
telangana minister srinivas goud inspects National highway 167 works for mahaboobnagar to jadcherla….srinivas goud inspects NH 167 works
- Advertisement -