రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు..ప్రభుత్వ హత్యలే!

4
- Advertisement -

పది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్… డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకొకరు చనిపోతున్నారు అన్నారు. ఇటీవలనే సోమి రెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డిఈఓ కార్యాలయం దగ్గరే గుండెపోటుతో చనిపోయారు…ఈ మరణాలు రేవంత్ ప్రభుత్వ హత్యలే అన్నారు.

బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపైనా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తీసుకువస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. సీపీఎస్ కింద కట్ చేసిన అమౌంట్ కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు.

పదివేల మంది రిటైర్ ఉద్యోగులకు 4 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉందని.. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపైనా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఊరుకునే ప్రసక్తే లేదు. పీఎఫ్ సొమ్ములు వాడుకోవడం చట్ట విరుద్ధం. ప్రైవేటు కంపెనీలు పీఎఫ్ మొత్తాన్ని జమ చేయక పోతే కేసులు పెడతారు. అలాగే ఉద్యోగుల సొమ్మును ప్లాన్ అకౌంట్లో జమ చేయని శాఖాధిపతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Also Read:వీడియో..అంతరిక్షం నుండి శుభాంశు

- Advertisement -