బాధిత చిన్నారులకు అండగా ఉంటాం: శ్రీనివాస్‌ గౌడ్‌

2
- Advertisement -

ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో చదవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాగనూరు ఫుడ్‌పాయిజన్‌ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు.మహబూబ్‌నగర్‌ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న మాగనూర్‌ జడ్‌పీహెచ్‌ఎస్‌ విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్… సర్కార్‌ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని… ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత చిన్నారులకు అండగా ఉంటామని చెప్పారు.

Also Read:Gautam Adani: గౌతం అదానీకి షాక్‌.. అరెస్టు వారెంట్

- Advertisement -