తెలుగులోకి కేజీఎఫ్‌ భామ

55
- Advertisement -

“కె.జి.యఫ్ 1, 2” చిత్రాలు ఇండియా మొత్తం ఆడాయి. ఒక విధంగా నిజమైన పాన్ ఇండియా సక్సెస్ ఆ మూవీదే. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని పలువురు తెలుగు దర్శకులు అనుకున్నారు. కానీ, ఇప్పటివరకు కుదరలేదు. మొత్తానికి ఆ కన్నడ కస్తూరి ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసింది అని టాక్. ఆ రెండు సినిమాల్లో ఒకటి.. నితిన్ హీరోగా రాబోతున్న ‘తమ్ముడు’ సినిమా. రీసెంట్ గా ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది. ఇందులో శ్రీనిధి శెట్టి ఒక హీరోయిన్ గా నటించనుంది.

అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు అని అంటున్నారు. మెయిన్ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదట. నితిన్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాడు. కానీ “తమ్ముడు” సినిమా పవన్ కళ్యాణ్ చిత్రం టైటిల్ కావడంతో ఆసక్తి ఏర్పడింది. ఇక శ్రీనిధి శెట్టి సైన్ చేసిన రెండో సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి”. ఈ సినిమాలో కూడా శ్రీనిధి శెట్టి కనిపించబోతుంది. ఓ కీలక పాత్రలో ఆమె నటిస్తోంది. నిజానికి శ్రీనిధి శెట్టి కంటే ముందే.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

మరి ఉన్నట్టు ఉండి.. శ్రీనిధి శెట్టి పేరు ఈ సినిమాలో వినిపిస్తోంది. ఓజి సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకే.. పాన్ ఇండియా వైడ్ గా ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అని శ్రీనిధి శెట్టి తీసుకున్నారు. మరి ఈ రెండు సినిమాలు శ్రీనిధి శెట్టికి ఏ రకంగా ఉపయోగపడతాయో చూడాలి. “కె.జి.యఫ్ 1, 2” చిత్రాలు మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేదు.

Also Read:మాస్టర్ ప్లాన్..కాంగ్రెస్ బీజేపీ ఇంటర్నల్ దోస్తీ!

- Advertisement -