నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం హిట్ 3.ఈ సినిమా మే 1న రిలీజ్ కానుండగా నాని మరియు శ్రీనిధి శెట్టి కొన్ని రోజులుగా దేశమంతటా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ఇక ఈ నెల 30నే యూస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా HIT 3 ఇప్పటికే ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో $175Kకి పైగా వసూళ్లు సాధించింది. తాజా అప్డేట్స్ ప్రకారం, శ్రీనిధి త్వరలో అమెరికాకు బయలుదేరి HIT 3 ప్రీమియర్ షోకు హాజరుకానున్నారు.
ఏప్రిల్ 30న టెక్సాస్‌లోని సీనమార్క్ వెస్ట్ ప్లానో సినిమాస్‌లో ఆడి 10 థియేటర్లో మధ్యాహ్నం 1:30 PM షోను వీక్షించనున్నారు శ్రీనిధి శెట్టి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ డ్రామాకు సైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.
Also Read:శర్వా సినిమాలో అనుపమ!

