‘రామాయణం’లో సీత పాత్ర నాదే..కానీ!

7
- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, అందాల భామ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణాసురుడిగా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో తొలుత సీత పాత్ర కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.కేజీఎఫ్ సినిమాలో యశ్ పక్కన హీరోయిన్‌గా చేసిన తర్వాత, ఆయన రావణుడిగా, తాను సీతగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ కలిగిందని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

దీంతో సీత పాత్రలో నటించే అవకాశం సాయి పల్లవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘హిట్-3’లో తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని శ్రీనిధి చెప్పుకొచ్చింది.

Also Read:దసరాకే అఖండ 2..కన్ఫార్మ్!

- Advertisement -