శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. విజయానికి 9 వికెట్ల దూరంలో నిలిచింది. 446 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండోరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక గెలవడం కష్టమే. రెండో ఇన్నింగ్స్ మూడో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో తిరుమన్నే సున్నా పరుగులకే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 446 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలిఇన్నింగ్స్:252
శ్రీలంక తొలి ఇన్నింగ్స్:109
భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9