క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న శ్రీలంక బౌలర్ మలింగ

367
malinga Retirement
- Advertisement -

సీనియర్ క్రికెటర్లు అందరు వరుసగా ఈమధ్య రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. తాజాగా శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ కూడా త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మలింగ ఇంటర్నేషనల్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు. శంలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డే అనంతరం అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు మలింగ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని శ్రీలంక కెప్టెన్‌ కరుణరత్నే తెలిపారు. ఈ విషయం మలింగ తనకు చెప్పాడని కరుణరత్నే వెల్లడించాడు.

బంగ్లాదేశ్ తో జరగనున్న సిరీస్ కు సోమవారం 22మందితో కూడిన జట్టును ప్రకటించింది శ్రీలంక క్రికెట్ బోర్డ్. సిరీస్‌లో 26న తొలి వన్డే జరగనుండగా.. అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. మలింగ ఇప్పుటి వరకు 219 వన్డేలు ఆడి 335 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచకప్‌ టోర్నీలోనూ శ్రీలంక జట్టు తరఫున 7 వన్డేల్లో 13 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు మలింగ. 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్‌ (523), చమిందా వాస్‌ (399) తర్వాత మూడో బౌలర్‌ మలింగయే.

- Advertisement -