- Advertisement -
శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటగా ప్రజలు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మంత్రివర్గం ముకుమ్మడి రాజీనామా చేసింది. 26 మంది మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ప్రధాని మహింద రాజపక్సకు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలను అందించారు. మంత్రివర్గం నుంచి తప్పుకున్న వారిలో ప్రధాని మహీంద రాజపక్స పెద్ద కుమారుడు నమల్ రాజపక్స కూడా ఉన్నారు.
దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పధాని మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ప్రధాని కార్యాలయం తిరస్కరించిన గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామా చేశారు.
- Advertisement -