కృష్ణ లీలలకి రోబోటిక్స్ కి సంబంధం ఏంటి?

260
- Advertisement -

శ్రీ కృష్ణ లీలలకి రోబోటిక్స్ కి సంబంధం ఏంటి?.. సంస్కృతానికి సైన్స్‌ కి లింక్ ఏంటి?.. తెలుసుకోవాలంటే కాలిఫోర్నియా లోని లివెర్మోరే టెంపుల్ కి వెళ్లి చుడాలిసిందే…. లివెర్మోరే టెంపుల్ యూత్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం వారు ప్రతి వారము పిల్లలకి సంస్కృతము, రోబోటిక్స్,ప్రోగ్రామింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వొంటి కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. నవంబర్ 12 న జరిగిన కార్యక్రమంలో పిల్లలు సంగీతము, సాంస్కృతిక నృత్యాలు మరియు శ్లోకా ఛాటింగ్ ప్రదర్శనలు చేసారు. ముఖ్యంగా లిటిల్ కృష్ణ అడ్వెంచర్స్ విత్ రోబోటిక్స్ కళ్ళకు వీనుల విందు చేసింది… చిన్నారులు శ్రీ కృష్ణ లీలలను వివిధ రకాల రోబోటిక్ పరికరాలతోటి తయారు చేసి ప్రదర్శన చేసారు. సంస్కృతము సంస్కృతి అండ్ టెక్నాలజీ అన్న సిధ్ధాంతం తోటి యూత్ అండ్ ఎడ్యుకేషన్ లివెర్మోర్ విభాగం వారు బే ఏరియా వాసులకు సేవలందిస్తున్నారు. భారతీయ సంస్కృతిని టెక్నాలజీ వాడుక తోటి దేశ విదేశాలలో చాటి చెప్పాలన్న సంకల్పం తోటి ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

నేటి యాంత్రిక యుగంలో రోబోటిక్స్ సహాయంతో శ్రీకృష్ణ లీలలు ప్రదర్శించడం అత్యంత అధ్బుతమని ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి వచ్చిన సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుని జననం నుంచి శకటాష హరణం, పూతన హరణం, గోవర్థన గిరిని ఎత్తడం లాంటివి రోబోటిక్స్ రూపంలో ప్రదర్శించారని… చిత్రీకరణ, చిత్రాల వర్ణన అద్బుతమన్నారు. నేటితరం పిల్లలు చాలా చక్కగా వర్ణిస్తున్నారని తెలిపారు. రోబోటిక్స్‌ ద్వారా శ్రీ కృష్ణ లీలలు రూపొందించడం ద్వారా పిల్లలకు చరిత్ర, కల్చర్ లాంటి విషయాలు తెలుసుకుంటున్నారని పిల్లల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్కృతాన్ని రోబోటిక్స్‌లో ఉపయోగించి తాము చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా శ్రీకృష్ణుని గురించి తెలుసుకున్నామని పిల్లలు చెప్పారు.

లివర్ మోర్ శివ విష్ణు దేవాలయంలో వాలంటీర్ ఎక్జూగ్యూటివ్ చైర్మన్‌ శ్రీకాళీ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఇక్కడ రోబోటిక్స్ టెక్నాలజీ ప్రవేశపెట్టామన్నారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్లో బాగంగా ఉచితంగా ఎంటర్‌ప్రన్యూర్ షిప్‌ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా పిల్లలకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రోబోటిక్స్‌ ద్వారా శ్రీకృష్ణ లీలలు కార్యక్రమం ద్వారా పిల్లలకు కొత్త పద్దతిలో పాఠాలు నేర్పుతున్నామన్నారు. ఇందులో టీచర్లు, ఇంజనీర్స్, ఆర్టీస్ట్స్‌, ఇన్నోవేటర్స్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.

https://youtu.be/vGFnvsoK3Vk

- Advertisement -