నవంబర్‌లో శ్రీకాంత్‌ ‘ఆపరేషన్‌ 2019’..

246
- Advertisement -

శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ 2019’. బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌… అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్‌, సునీల్‌ ‘కీ రోల్స్‌’ (కీలక పాత్రలు) చేస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’ అనే సినిమా చేశాడు.

Operation 2019

ఈ మూవీ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైంది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. ఈ సినిమా ఏ పార్టీనీ ఉద్దేశించి ఉండదనీ .. ప్రజల తరఫున పోరాడేదిగా ఉంటుందని శ్రీకాంత్ చెప్పాడు. ఇది ‘ఆపరేషన్ దుర్యోధన’కి సీక్వెల్ కాదనీ .. వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు. రాజకీయ నేపథ్యమే అయినప్పటికీ వాటిని ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటుందని చెప్పాడు.

- Advertisement -