మాస్ హీరోగా కుర్ర హీరో

1991
- Advertisement -

మాస్ హీరో అయిపోవాలని కామెడీ క్యారెక్టర్స్ చేసే నటుడికి కూడా ఆశ ఉంటుంది. అందుకేనేమో ప్రతి యంగ్ హీరో మాస్ కథ కోసం పడిగాపులు కాస్తుంటాడు. ఇక ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లాంటి హీరోలను ఒప్పించాలి అంటే కచ్చితంగా మాస్ కథ చెప్పాల్సిందే. లేటెస్ట్ గా హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా మాస్ బాట పడుతున్నాడు. పెళ్లి సందD సినిమా తరువాత రోషన్ ఏ సినిమా కథ ఒప్పుకోలేదు. ప్రస్తుతం తన తండ్రి హీరో శ్రీకాంత్ సపోర్ట్ తో కథలు వింటున్నాడు.

కథలు అంటే.. వైవిధ్యం అనుకోకండి. పక్కా మాస్ కథ కావాలి అంటూ రోషన్ డైరెక్ట్ గా మేకర్స్ కి కండిషన్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన అవుట్ అండ్ అవుట్ మాస్ కథ రోషన్ కి బాగా నచ్చిందట. కానీ నిర్మాత ఎవరు?, రోషన్ కి మార్కెట్ లేదు. అలా అని శ్రీకాంత్ ఇప్పటికప్పుడు సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయలేడు. కాబట్టి.. రోషన్ ను మాస్ హీరోగా నిలబెట్టే బాధ్యతను నిర్మాత నిరంజన్ రెడ్డి తీసుకున్నారని తెలుస్తోంది.

నిర్మాత నిరంజన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవికి మధ్య అనుబంధం ఉంది. అందుకే, తన బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి రోషన్ హీరోగా వస్తున్న సినిమాను నిర్మించబోతున్నారు. ఇంతకీ రోషన్ లాంటి హీరో మీద ఇంత భారీ సినిమా వర్కౌట్ అవుతుందా ?, మరోపక్క మాస్ సినిమాలు చేసే యంగ్ హీరోలను జనం వెంటనే కిలో మీటర్ దూరం పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

బేషరమ్‌ సాంగ్‌ను మార్చండి: సీబీఎఫ్‌సీ

నేను సినీ పెద్దను కాను:చిరంజీవి

2023లో రైటర్ పద్మభూషణ్..

- Advertisement -