హర్రర్ ధ్రిల్లర్ గా ‘రా.రా…’

278
Srikanth Horror Comedy Movie Ra Ra Release Soon
- Advertisement -

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని రేడియో మిర్చి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాప్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా సంగీత దర్శకునితో పాటు గాయని శ్రావణ భార్గవి ఆలపించారు.

Srikanth Horror Comedy Movie Ra Ra Release Soon

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’ ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. ఈ గీతానికి శ్రోతలనుంచి మంచి స్పందన లభించటం ఎంతో ఆనందంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.

Srikanth Horror Comedy Movie Ra Ra Release Soon

మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న ‘రా..రా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు ఒక గీతాన్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఇతర గీతాలను ఒకొక్కటిగా విడుదల చేయటం జరుగుతుంది. చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను త్వరలో విభిన్న రీతిలో హైదరాబాద్ లో జరుపనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈ నెల లోనే చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

Srikanth Horror Comedy Movie Ra Ra Release Soon

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి ,నిర్మాత: విజయ్ ,దర్శకత్వం: విజి చరిష్ యూనిట్.

- Advertisement -