7 రోజులు…37 గంటలు

5
- Advertisement -

అసెంబ్లీ, మండలి సమావేశాలు 7 రోజులు జరిగాయిని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. 37 గంటల 44 నిమిషాల పాటు సభ జరిగిందని…71 మంది సభ్యులు సభలో మాట్లాడారు అన్నారు. 8 బిల్స్ ను శాసనసభ ఆమోదించింది.

షాట్ డిస్కషన్ లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు,టూరిజం పాలసీ, రైతు భరోసా అంశాలను చర్చించాం అన్నారు.తెలంగాణ తల్లి విగ్రహం పైన ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు..శాసనమండలి 28.3 గంటలు పనిచేసింది. మండలిలో సభ్యులు 38 ప్రశ్నలు వేశారు అన్నారు.

మహిళా యూనివర్సిటీ కి గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు.మా ప్రభుత్వం చాకలి ఐయిలమ్మ మహిళ యూనివర్సిటీ కి చట్టబద్ధత కల్పించింది.ధరణి ని బంగాళాఖాతంలో వేస్తామని గతంలో మేం చెప్పాం.అసెంబ్లీ లో తెలంగాణ భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టి ఆమోదింపచేశాం అన్నారు.

కొత్త మున్సిపాలిటీ లు,కొత్త కార్పొరేషన్ల బిల్లు ను తీసుకువచ్చాం..ప్రతిపక్ష పార్టీ సభ్యుల సలహాలు సూచనలతో ముందు కు వెళ్లాం అన్నారు.ప్రజాస్వామిక పద్దతిలో యేడాది నుంచి ఒక్క సస్పెన్షన్ లేకుండా సభను నడిపాం…అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు 6.23 గంటలు.బీఆర్ఎస్ సభ్యులు 5.6 గంటలు.బీజేపీ సభ్యులు 3.20 గంటలు, ఎంఐఎం సభ్యులు 3.39 గంటలు, సీపీఐ సభ్యుడు 1.56 గంటలు సభలో మాట్లాడారు అన్నారు.

Also Read:తనపై కావాలనే దుష్ప్రచారం: అల్లు అర్జున్

మూసి ప్రక్షాళన లో పేదలకు అన్యాయం జరగనివ్వమని సభావేదిక గా స్పష్టం చేశాం..ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం.స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం అన్నారు.

- Advertisement -