బుల్లి శ్రీదేవికి ఎంట్రీ దొరికింది..

246
Jhanvi-Kapoor
- Advertisement -

ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ వెండితెర అరంగేట్రంపై ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీదేవి బాటలోనే సినీ రంగంవైపు అడుగులు వేసేందుకు అమ్మడు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఇన్ని రోజులు జాన్వీ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ బోలెడన్నీ కథనాలు వచ్చినా..వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా కూతురు జాన్వీ ఎంట్రీపై తండ్రి బోణికపూర్ నోరు విప్పాడు. త్వరలోనే తన కూతురు బాలీవుడ్ కు పరిచయం కాబోనుందని సస్పెన్స్ ను రివీల్ చేశాడు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరన్ జోహార్‌ తెరకెక్కించే ప్రాజెక్ట్‌ తో జాన్వీ పరిచయం కానుందని వెల్లడించారు.

sridevi-daughters

కరణ్ జోహార్ ఆద్వర్యంలోజాన్వీ పరిచయం కానుందనే క్లారిటీ వచ్చినా ఏ సినిమాతో అనేది ఇంకా తెలియలేదు. మరాఠీలో ఘనవిజయం సాధించిన సైరత్ సినిమా రీమేక్‌తో జాహ్నవి ఎంట్రీనా..లేక స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ లో సినిమాతోనే అనేది కొంతకాలంగా సస్పెన్స్‌ నడుస్తోంది. ఇదే విషయాన్నిబోణికపూర్ ను అడుగగా..ఎలాంటి ప్రాజెక్ట్‌ అనేది ఇంకా ఫైనలైజ్‌ కాలేదని సమాధాన మిచ్చాడు. జాహ్నవి ఎంట్రీ గురించి కరణ్‌ మాతో మాట్లాడారు. మేం అనుమతి ఇచ్చాం. అయితే ఏ సినిమా అనేది ఇంకా కన్ఫర్మ్‌ కాలేదు. కరణ్‌ ఇటీవల ‘సైరత్‌’ రీమేక్‌ హక్కులు తీసుకున్నారన్నారు. కాబట్టి సైరత్ సినిమా రీమేక్ తోనే జాన్వీ లాంచ్‌ కావొచ్చునని భావిస్తున్నారు’ అని బోనీ చెప్పారు. జాన్వీ సినిమా ఎంట్రీ గురించి బోనీ అఫీషియల్‌గా చెప్పడం ఇదే తొలిసారి. మహేశ్‌బాబు-మురుగదాస్‌ సినిమా కోసం జాన్వీని అడిగినట్టు అప్పట్లో కథనాలు జోరగా వినిపించాయి.

Jhanvi-Kapoor

జాహ్నవి వెండితెర అరంగేట్రం పై ఓవైపు ఇండస్ట్ర్రీలో జోరుగా చర్చ నడుస్తుంటే..మరోవైపు వ్యక్తి గత విషయాలతో అమ్మడు బాగానే వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే భాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతు హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దూమారమే చలరేగింది. ప్రస్తుతం అమ్మడు నటనలో మెలకువలు నేర్చుకుంటోంది. అందుకోసం స్పెషల్‌గా అమెరికాలో శిక్షణ పోందుతోంది. జాన్వీ ఎంట్రీ ఇప్పటి వరకైతే చాలా అంచానాలే నెలకొన్నాయి.మరి ఈ బుల్లి శ్రీదేవి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

sridevi-daughters

- Advertisement -