కూతురికి శ్రీదేవి వార్నంగ్‌..

198
Karan Johar to launch Sridevi’s daughter
- Advertisement -

మన లైఫ్‌లో ఇప్పుడు సెల్‌ఫోన్లు ఒక భాగంగా మారాయి,సెల్‌ఫోల్లతో సెల్ఫీ ఫొటోల ట్రెండ్ ఎక్కువవుతోంది. సెల్‌ఫోన్లలో సెల్పీ ఫొటోలు తీసుకోవడం, వాటిని ఇంటర్నెట్లలో పోస్ట్‌ చేయడం యువతకు ఒక పిచ్చిగా మారిందనే చెప్పాలి. ఇక ఈ సెల్ఫీ పిచ్చి అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలికి బాగా ఉందట. శ్రీదేవికి జాన్వి, ఖుషీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. వారిద్దిర్ని హీరోయిన్లుగా చేసే ప్రయత్నంలో శ్రీదేవి ఉన్నారు.అయితే ఇప్పటికే జాన్వీకి హీరోయిన్ గా తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వచ్చినా శ్రీదేవి తోసిపుచ్చారు.అయితే జాన్వి చిత్ర పరిచయానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.

Sridevi Warns Her Daughter Jhanvi Kapoor

హిందీలో మెగా డైరెక్టరైన కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో నటించడానికి జాన్వి ఎన్నికయ్యారు. ఈ ముద్దుగుమ్మకి సెల్ఫీ పిచ్చి బాగా ఉందట. తన సెల్ఫీ ఫొటోలను, ఇతరులతో దిగిన సెక్సీ సెల్ఫీ ఫొటోలను వెంటనే వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయడం జాన్వీకి ఒక వ్యసనం లాంటిదట. నటిగా రంగప్రవేశం చేయనున్న జాన్వీని సెల్ఫి ఫొటోలు తీసుకోవద్దని ఆమె తల్లి శ్రీదేవి స్ట్రిక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశారట.అలా సెల్ఫీల పిచ్చి వల్ల నటనపై ఏకాగ్రత లోపిస్తుందని, అంతే కాకుండా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హితవు కూడా చెప్పారట. మరి తల్లి మాటను జాన్వీ ఎంత వరకూ పాటిస్తుందో వేచి చూడాలి.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో తమ చిత్రాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకునేటప్పుడు దర్శక నిర్మాతలు వారికి విధించే షరతుల్లో హీరోలతో డేటింగ్‌ చేయరాదన్నది కూడా ఉంటుంది. అలా డేటింగ్‌ వారి మధ్య ప్రేమగా మారి ఎక్కడ షూటింగ్‌కు ఆటంకంగా మారుతుందోనని వారి భయం కావచ్చు.అయితే ఇవన్నీ కొత్తగా పరిచయం అయ్యే తారలకే మాత్రమేనట.

- Advertisement -