ఈ శుక్రవారం అందరి దృష్టి రెండు సినిమాల మీదే ఉంది. మొదటిది సార్. ధనుష్ ఫస్ట్ టైం తెలుగు నేర్చుకుని మరీ నటించిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇది. ముందు రోజే చాలా చోట్ల స్పెషల్ ప్రీమియర్లు వేయడంతో అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. రెండోది వినరో భాగ్యము విష్ణు కథ. కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మూడు ఫ్లాపుల తర్వాత దీని మీద బోలెడు నమ్మకంతో మంచి ప్రమోషన్లు చేసుకుంటున్నాడు
ఇక్కడ బయటికి కనిపించని హడావిడి చేయని మరో మూవీ కూడా ఉంది. సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు శనివారం రిలీజ్ కాబోతోంది. నిర్మాత ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల. దీని టీజర్ ని అప్పుడెప్పుడో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయడం ఫ్యాన్స్ కి గుర్తుండే ఉంటుంది. థియేటర్లకు రావడానికి ఈ చిత్రానికి ఇప్పటికి మోక్షం దక్కింది.
చిన్నదో పెద్దదో సినిమా ఎలాంటిదైనా శ్రీదేవి శోభన్ బాబుకి ఎలాంటి సౌండ్ చేయడం లేదు. అసలు విడుదలవుతున్న సంగతే ఎవరికీ గుర్తు రావడం లేదు. బుకింగ్స్ మరీ అన్యాయంగా ఉన్నాయి. అసలే సంతోష్ శోభన్ కు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం రూపంలో రెండు డిజాస్టర్లు పడ్డాక ఇధి వస్తోంది. అతను కానీ హీరోయిన్ కానీ ఇంటర్వ్యూలు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అడిగితే తండ్రినో తమ్ముడు రామ్ చరణో ప్రమోషన్ లో ఓ చేయి అందించే అవకాశం ఉన్నా సుస్మిత ఎందుకు వాడుకోవడం లేదో మరి.
ఇవి కూడా చదవండి..