సిరిమల్లెపూవు వసివాడింది.. అర్ధశతాబ్దంపాటు భారత సినీతోటలో సుగంధాలను విరబూసిన నటనాకుసుమం నేలరాలింది. మూడో ఏటనుంచే వెండితెరపై జిగేల్‌మన్న వెలుగుల నక్షత్రం.. చుక్కల లోకానికి వెళ్లిపోవడం అభిమానులను గుండెలను పిండివేస్తోంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు.
2017లో వచ్చిన ‘మామ్’ చిత్రం ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు. ఆతర్వాత మంచి కథలు వస్తే తప్పకుండా నటించానని చెప్పిన శ్రీదేవి ఆ ముచ్చట తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
అందరితో సన్నిహితంగా ఉండే శ్రీదేవి తోటి నటీనటులను, ఇతర సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తమిళంలో నటి ధన్సిక ప్రధాన పాత్రలో ‘కాతడి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ శ్రీదేవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ ట్వీట్ పెడుతున్నప్పుడు దుబాయ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ చిత్ర బృందానికి అభినందనలు తెలిపింది. దురదృష్టవశాత్తు అతిలోక సుందరి చేసిన ఆఖరి ట్వీట్ కూడా ఇదే.
Wishing the cast and crew of Kaathadi all the very best! @avishekactor @saidhansika https://t.co/MeKT4Uu33P
— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) February 23, 2018