వామ్మో…మమ్మీకి అన్నేసి ఆఫర్లా..?

341
sridevi gives big offers to boni kapoor from mom movie
- Advertisement -

అతిలోకసుందరి శ్రీదేవి అందాలను యూత్‌ ఎప్పటికైనా మర్చిపోలేరు. శ్రీదేవిని కూడా మర్చిపోరనుకోండి..! అయితే ఈ మధ్య కొంతకాలంగా టాప్ ట్రెండింగ్ లోనే ఉంటోంది శ్రీదేవి. దానికి కారణం తన పెద్ద కూతురు జాన్వి కపూర్. శ్రీదేవి టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి,  తన కూతురు జాన్వి కి సంబంధమేంటి.. అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం.

జాన్వి కి సంబంధించిన న్యూస్‌ ద్వారే ఇప్పుడు శ్రీదేవి వార్తల్లో నిలుస్తోంది.  జాన్వీ అరంగేట్రం నుంచి స్టైలింగ్ వరకు,  బాయ్ ఫ్రెండ్స్ నుంచి రిలేషన్స్ వరకూ చాలారకాల న్యూస్ లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామ్’ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. శ్రీదేవి రీఎంట్రీ సాఫీగానే జరిగింది. ఇంగ్లీష్-వింగ్లిష్ తోనూ ఆకట్టుకుంది.
sridevi gives big offers to boni kapoor from mom movie
కానీ శ్రీదేవికి కోలీవుడ్ మూవీ పులితో ఎదురుదెబ్బ తగిలింది. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న శ్రీదేవి.. ఇప్పుడు మామ్ ను ఆల్‌మోస్ట్‌ ఫినిష్ చేసేసింది. కానీ..ఈ చిత్రానికి సంబంధించిన మార్కెటింగ్ కబుర్లు  మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ మీడియా సంస్థ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి దక్కించుకుంది. ఇదే అనుకుంటే..దీంతోపాటు ఓ బోనస్ కూడా ఉంది. మామ్ కనుక థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలో ఓ ఫిగర్ ను అధిగమిస్తే.. మరింత మొత్తం చెల్లిస్తామని ఆఫర్‌ కూడా ఇచ్చేశారు.

ఈ సినిమా వల్ల బోనీకపూర్ కి అదిరిపోయే ఆఫర్ కూడా దక్కింది. తమ గ్రూప్ నకు చెందిన ఎంటర్టెయిన్మెంట్ ఛానల్ లో.. అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా కూడా స్థానం కల్పించారట. సినిమాల నిర్మాణ భాగస్వామ్యం కోసం.. బోనీకపూర్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సినిమాతో ఇన్నేసి బంపర్ ఆఫర్లను భర్తకు ఇవ్వడం శ్రీదేవికే  సాధ్యమైంది అనుకోవాలి మరి.

- Advertisement -