తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు ముంబైలోని సెలబ్రెటీ స్పోర్ట్స్ క్లబ్ ముందు జనం బారులు తీరారు. వేలాది మంది అభిమానులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.శ్రీదేవి లాస్ జర్నీతో ముంబై నగరం మూగబోయింది. అతిలోక సుందరి శ్రీదేవి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీస్ బ్యాండ్ బృందం స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకున్నది. అక్కడి నుంచి విలేపార్లే శ్మశానవాటికలో జరిగే అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. గౌరవ వందనం సమర్పించనున్నారు.
శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబయిలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్, నాగార్జున,బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖుల్లో ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్, సంజీవ్ కపూర్, సోనమ్ కపూర్, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, ఫరా ఖాన్, అను కపూర్, హేమమాలిని, ఇషా డియోల్, హర్షవర్ధన్ కపూర్, రవి కిషన్, సుభాష్ ఘాయ్, టబు, మాధురీ దీక్షిత్, సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, అక్షయ్ ఖన్నా, రితేశ్ దేశ్‌ముఖ్, సుస్మితాసేన్ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.
Mumbai: #Sridevi to be cremated with state honours, Mumbai Police band reaches Celebration Sports Club. pic.twitter.com/GnAWgEPlIY
— ANI (@ANI) February 28, 2018
శ్రీదేవి నివాసం, క్లబ్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విల్లే పార్లేలోని హిందూ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది.