నటి శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు కూడా భారత్ చేరుకోదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీదేవి ఈరోజు భారత్‌కు అప్పగించలేమని దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపారు.
శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు..ప్రాసిక్యూషన్ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ అధికారి ఒకరు భారతీయ మీడియాతో మాట్లాడారు. ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు మరిన్ని పత్రాలు కావాలని భారత కాన్సులేట్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని ఆయన తేల్చేశారు. దీంతో ఆమె భౌతిక కాయన్ని భారత్ తరలించే విషయంపై సంగ్దిగ్ధత నెలకొంది.