హైద‌రాబాద్‌లో శ్రీదేవికి సంతాప సభ..

327
- Advertisement -

శ్రీ‌దేవి మ‌ర‌ణం, ఆమె జ్ఞాప‌కాలు ఇంకా క‌ల‌చి వేస్తూనే ఉన్నాయి. శ్రీ‌దేవి చ‌నిపోవ‌డం ఏమిటి.. అని ఇంకా చాలా హృద‌యాలు.. అల్లాడిపోతున్నాయి. ఆమె మ‌ర‌ణం.. చిత్ర‌సీమ‌నే కుదిపేసింది. ఆమె క్రేజ్ ఏంటో.. మీడియా చేసిన హంగామా చూస్తే తెలుస్తుంది. సంపాదించుకున్న అభిమాన ఎంతో… ఆమెను క‌డ‌సారి చూడ్డానికి వ‌చ్చిన జ‌న సందోహాన్ని గ‌మ‌నిస్తే అర్థం అవుతుంది. అలాంటి న‌టి మ‌ళ్లీ రాదు. శ్రీదేవి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలలో నటించిన శ్రీదేవి తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. అమె మరణానికి టాలీవుడ్‌ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

Sridevi condolence meet

ఇటీవ‌ల మృతి చెందిన సినీ నటి శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో ఈరోజు ఎంపీ టీ సుబ్బ‌రామి రెడ్డి ఆధ్వ‌ర్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాప‌ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంతాప స‌భ‌కు సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలిసింది.

- Advertisement -