పవన్‌పై సంచలన ట్వీట్స్‌ చేసిన శ్రీరెడ్డి..

270
Sri Reddy Tweets on Pawan Kalyan
- Advertisement -

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వర్మ సలహాతో పవన్ ను అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి ….ఆ తర్వాత పవన్ కు ఆయన తల్లికి క్షమాపణలు చెప్పింది. అయితే నిన్న ఫిల్మ్ చాంబర్ లో పవన్ హడావిడి చేసిన తర్వాత….పవన్ పై తన ఫేస్ బుక్ లో వరుస పోస్టులతో విరుచుకుపడింది.

పవన్ కల్యాణ్‌ తీరు బాగోలేదంటూ యువనటి తాజాగా శ్రీరెడ్డి ట్వీట్లు చేసింది. ‘పవన్ కల్యాణ్ అన్న నేను స్టార్ట్ చేసిన ఈ ఉద్యమంలో ఎటువంటి రాజకీయ రంగూ లేదు, ఇదంతా మీకు మీరు ఏదేదో ఊహించుకుని సృష్టించిందే. మీ ఊహల్లోంచి వచ్చినవే ఈ పాత్రలు, సన్నివేశాలు, మరల చెబుతున్నా టీవీ9, ఏబీఎన్‌, మహాన్యూస్‌లకి ఏ సంబంధం లేదు, మీ ట్వీట్స్ చూస్తుంటే చాలా జాలి వేస్తుంది’ అని ఆమె పేర్కొంది.

Sri Reddy Tweets on Pawan Kalyanమరో ట్వీట్ చేస్తూ… ‘ఫ్యాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ప్రజల సమస్యల కోసం పోరాడుతూ నలుగురికి మార్గదర్శం అవ్వాలి. అంతేగాని సహనం లేకుండా కార్ లు పగలకొట్టడం కాదు, ఫాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు’ అని పేర్కొంది.

నిన్న పవన్‌ కల్యాణ్‌కు మెగా కుటుంబం మద్దతు తెలిపిన విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ… ‘ఈ రోజు స్పందించినట్లు మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ కి నేను వీరాభిమానిని’ అంటూ వారి ఫొటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -