పవన్ నువ్వు ప్రజా ద్రోహివి : శ్రీరెడ్డి

207
Sri Reddy Sensational post On Pawan Kalyan...
- Advertisement -

కాస్టింగ్ కౌచ్‌ మ్యాటర్ తో శ్రీరెడ్డి ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ క్రమంలోనే కాస్టింగ్‌ కౌచ్‌ కాంట్రవర్శీ సైడ్‌ ట్రాక్‌పట్టి, పవన్ పట్టాలెక్కింది. పవన్‌ ని అక్షరాల్లో కూడా చెప్పలేని మాటతో ధూషించిన శ్రీరెడ్డి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తోంది.

Sri Reddy Sensational post On Pawan Kalyan...

తాజాగా ఫేస్ బుక్‌ వేదికగా పవన్ పై మరోసారి విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి పై పదునైన వ్యాఖ్యలుచేసిన ఆమె ఇప్పుడు పవన్ సినీ, రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంపైనా ఘాటైన విమర్శలుచేసింది.

తాజాగా శ్రీరెడ్డి చేసిన పేస్‌బుక్‌ పోస్ట్‌ ఇది.
”మిస్టర్ ….. ఏమిటి ఈ మాయ…
పాచి పోయిన లడ్డూలు అన్నావు..
ఉత్తరం దక్షిణం అన్నావు..
అవినీతి జరుగుతుందన్నావు..
నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు…చూసుకోండి అన్నావు…
నాకు కులం లేదూ అన్నావు..మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు…
కామన్ మ్యాన్  ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు…
లెక్కలు నేను తేలుస్తాను అన్నావు…కమిటీలో దొంగల్ని పెట్టావు..
మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..
నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు…
పవర్ ను అనుకున్నావు..ఎన్ని చెత్త ఫ్లాప్ సినిమాలో లెక్కేసుకో…
ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు…. ఒకటికి మూడు చేసుకున్నావు…..
నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు…
చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..
నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు…
నిన్నేమనాలి….నువ్వు ఆంధ్రాద్రోహివి…ప్రజా ద్రోహివి..జనద్రోహివి.
తెలుగుప్రజలు నిన్ను క్షమించరు……
ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు…. ఎవరూ ఏమాట మోడీని అన్నా… మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు…..ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం….” అంటూ పవన్ కళ్యాణ్‌ ట్వీట్లను ఉద్దేశించి శ్రీరెడ్డి పోస్టు చేసింది.

- Advertisement -