షకలక శంకర్ పళ్లు రాలగొడతా

195
srireddy_shakalaka-shankar_
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేసి గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌లోని పలువురిపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి ఈసారి తాజాగా మరో నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈసారి ఆమె ఏకంగా ఆ నటున్ని పల్లు రాలగొడతా అంటూ తీవ్రంగా స్పందించింది. ఇంతకు శ్రీరెడ్డి అంతటి ఘాటు వ్యాఖ్యలు ఏ నటుడిపై చేసింది అని అలోచిస్తున్నారా… తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా రాణిస్తూ ఇటీవలే శంభో శంకర సినిమాతో హీరోగా పరిచయమైన షకలక శంకర్‌.

sri reddy

అవును శ్రీరెడ్డి షకలక శంకర్‌నే పళ్లు రాలగొడతా అంటూ తీవ్ర పదజాలంతో దూషించింది. ఇంతకు శ్రీరెడ్డి శకలక శంకర్‌ను అంత ఘాటుగా ఎందుకు దూషించిందంటే.. శంకర్‌ హీరోగా నటించిన శంభో శంకర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తనపై శంకర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీరెడ్డి ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు ఎందుకు వాడుకుంటారు. ఇప్పటి వరకు తాను ఇండస్ట్రీలో ఎదగడానికి ఎవరి పేరును వాడుకోలేదు. నేను ఇండస్ట్రీలో ఫేమస్‌ కావడానికి ఎ ఒక్కరిపై ఆధారపడలేదని, కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని ఓ టాప్‌ హీరో భక్తులు అతని పేరు చెప్పుకొని, అతన్ని దేవుడిని చేస్తూ తమ కోసం ఎంతో చేస్తున్నాడు.. ఆయన మా దేవుడు అంటూ అతనిని ఆకాశానికెత్తుతూ మొత్తం మీద బతికేస్తున్నారు. ఎవరి పేరో చెప్పుకుని మీరు బతకండి.. ఆ హీరో ఫ్యాన్స్‌ను మీరు వాడుకోండి.. మీ సినిమా ఓపెనింగ్స్ లకి ఆ హీరోను రప్పించుకోండి.. మీరు ఏకంగా ఆ హీరోని నెత్తిన పెట్టుకోండి.. ఆయన పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రండి.. కానీ ఏ సంబంధం లేకుండా తన పేరును ఇష్టమొచ్చినట్టుగా వాడుకుని, తనపై విమర్శలు చేస్తే పళ్లు రాలగొడతాను అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శ్రీరెడ్డి.

 Shakalaka-Shankar-

కమెడియన్‌ గా ఉన్న నువ్వు హీరోగా పరిచయం అయ్యావు. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. షకలక శంకర్‌ ఏం గొప్పోడు కాదు.. శంభో శంకర సినిమా నిర్మాత ఏం గొప్పోడు కాదు.. అందరి చిట్టాలు తన దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని, బడా హీరోల పేర్లు చెప్పుకుని వ్యాపారం చేసుకోవాలనుకోవడం మంచిది కాదని శ్రీరెడ్డి షకలక శంకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -