క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్లో అమ్మాయిలు పడుకుంటేనే అవకాశాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి లీక్స్ పేరుతో తొలుత కని,కనిపించని ఫోటోలను బయటపెట్టిన ఈ అమ్మడు తాజాగా కొంతమంది పేర్లను నేరుగా చెబుతు మరికొంతమంది పేర్లను ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామ్‌తో జరిపిన రహాస్య చాటింగ్‌తో పాటు సెల్ఫీ పోటోలను బయటపెట్టగా తాజాగా మరో అడుగు ముందుకేసి ఓ యంగ్ హీరో పేరును పరోక్షంగా ప్రస్తావించింది. నీవు స్క్రీన్ మీదే కాదు నిజ జీవితంలోనూ నేచురల్‌గా యాక్ట్ చేస్తావు..ఇటీవలె నీకు కొడుకు పుట్టాడు..కంగ్రాచులేషన్స్ అంటూ ఓ హీరో పేరును బయటపెట్టింది. పేరు చెప్పకపోయిన ఈ హీరో ఎవరో ఇప్పటికే అందరికి అర్ధమై ఉంటుంది.
నేచురల్‌గా కనిపిస్తావు కానీ అది ముసుగు మాత్రమే..జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకుంటావు అదంతా జనాల సానుభూతి కోసమే.నీకంటే పెద్ద హీరోలే చాలా బెస్ట్..వాళ్లకు వాళ్ల తండ్రులు,తాతల అండ ఉన్నప్పటికి ఎంతో నిజాయితీ ఉంటారు. చరణ్,మహేష్,జూనియర్ ఎన్టీఆర్‌ల నుంచి నీవు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది వాళ్ల యాటిట్యూడ్ చాలా గొప్పదని తెలిపింది.
చిన్న దర్శకులను, ఇప్పుడే ఎదుగుతున్న దర్శకులను నీవు గౌరవించవు. ఎంతో మంది అమ్మాయిలను నీవు వాడుకున్నావు. వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకో. న్యాయం అనేది ఎప్పుడూ మంచి వైపే ఉంటుంది. కాకపోతే శిక్షకు కొంచెం సమయం పడుతుంది. నీవు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావ్ అంటూ ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.