నాకు ఎయిడ్సా…తాట తీస్తా..!

232
Sri Reddy Death She Clarify Rumours
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై కొంతకాలంగా పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.తనతో పాటు కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి చనిపోయిందని కొన్ని రోజులుగా యూట్యూబ్,సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. కొంతమంది ఎయిడ్స్‌తో చనిపోయిందంటూ ప్రచారం చేయగా మరికొంతమంది ఆత్మహత్య చేసుకుందని పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఒక్కొక్కడి తాట తీస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి అని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇప్పటి వరకు 41 మందిపై కేసులు నమోదయ్యాయని… ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా అని హెచ్చరించింది. శ్రీరెడ్డి ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కొద్దిరోజుల క్రితం హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి, ఏకంగా 28మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏసీపీ అశోక్ చక్రవర్తికి వినతిపత్రం అందజేసింది. శ్రీరెడ్డి ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో జీవితారాజశేఖర్‌తో పాటు బాబు గోగినేని, పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

sri reddy facebook

- Advertisement -