అమ‌లాపాల్ ప్రియుడిపై కామెంట్ చేసిన శ్రీరెడ్డి

286
Sri-Reddy-
- Advertisement -

ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లాపాల్ త‌న ప్రియుడితో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేసి మ‌రోసారి వైర‌ల్ గా మారింది. త‌న ప్రియుడు , పంజాబీ సింగ‌ర్ భ‌వ్నీంద‌ర్ సింగ్ తో చాలా క్లోజ్ గా పెళ్లి దుస్తుల‌తో ఫోటోల‌కు ఫోజులిచ్చారు. అయితే వీరిద్ద‌రికి వివాహం జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై స్పందించింది అమ‌లాపాల్. తానేమి ఇంకా వివాహం చేసుకోలేద‌ని..అవి కేవ‌లం ఫోటోషూట్ మాత్ర‌మే అని చెప్పాంది.

తాజాగా అమ‌లాపాల్ ఇష్యూ గురించి ప్ర‌ముఖ న‌టి శ్రీరెడ్డి స్పందించింది. బాధ‌ప‌డ‌కు అమ‌లాపాల్…నీ పంజాబీ భ‌ర్త బాగానే చూసుకుంటాడు. పంజాబీల‌పై నాకు న‌మ్మ‌కం ఉంది అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్ ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. కాగా అమ‌లాప‌ల్ త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ తో విడుకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే భవ్నీంద‌ర్ సింగ్ ను వివాహం చేసుకొనుంది.

- Advertisement -