శ్రీ‌రంగ‌నీతులు..టీజర్ డేట్ ఫిక్స్

28
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌మ‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సుహాస్‌, విరాజ్ అశ్విన్‌, రుహానిశ‌ర్మ‌, కార్తీక్ ర‌త్నం ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా శ్రీ‌కారం చుట్టింది. ఈ చిత్రం టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 5న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ…ఈత‌రం యువ‌త వారి ఆలోచ‌న‌ల‌ను, వారి ఎమోష‌న్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో మూడు పాత్రల ద్వారా చూపిస్తున్నాం.
ఇది వారి జీవితంలోని ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో చూపించే ప్ర‌య‌త్నం చేశాం. చిత్రంలోని ప్ర‌తి పాత్ర అంద‌ర్ని అల‌రిస్తుంది. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన హైపర్ లింక్ డ్రామా ఇది. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. మోడ్రన్ సెన్సిబిలిటీస్ తో అంద‌రికి న‌చ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ వి.ఎస్.ఎస్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర‌సాడ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ ఉప్ప‌టూరి.

Also Read:BRS:బి‌ఆర్‌ఎస్ ముందు బిగ్ టాస్క్?

- Advertisement -