శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ప్రీమియర్ షో

199
sri ramudintla sri krishnudanta
- Advertisement -

గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కెఎన్.రావ్ నిర్మాణంలో, నరేష్ పెంట దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలౌతోంది. అయితే చిత్ర యూనిట్ సినిమా మీదున్న నమ్మకంతో… వారం రోజుల ముందు నుంచే హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు వరుసగా వివిధ వయసుల వారికి ప్రత్యేకంగా షోస్ వేస్తూ వస్తోంది. ప్రతీ షోకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

పల్లెటూరి ప్రేమ కథను హృద్యంగా… భావోద్వేగాల్ని మిళితం చేసి చూపించారనే పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు నరేష్ పెంట… హీరోగా నటించిన శేఖర్, హీరోయిన్ గా నటించిన దీప్తి శెట్టి, హీరోయిన్ తండ్రిగా నటించిన మధు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. దర్శకుడు అద్భుతమైన ప్రేమ కథను పల్లెటూరి వాతావరణంలో చక్కగా చూపించాడనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. తండ్రిగా నటించిన మధు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. హీరో శేఖర్, మధు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయంటున్నారు. ప్రతీ ఒక్కర్ని ఆలోచింపచేసే విధంగా ఉన్న ఈ సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు, రీరికార్డింగ్ కుదిరాయని అంటున్నారు. దర్శకుడే మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో మంచి సంగీతం ఈ సినిమా ద్వారా పొందగలిగాం అనే కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి.

అన్నట్టు ఈ చిత్ర బిజినెస్ కూడా చక చకా జరుగుతోంది. ప్రీమియర్ షోస్ రిపోర్ట్ కనుక్కొన్న డిస్ట్రిబ్యూటర్స్… ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట చిత్రాన్ని కూడా అదే రీతిన ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.

శేఖర్ వర్మ, దీప్తి శెట్టి.మధుసూదన్,మదిమని, గౌతమ్ రాజు, గీతాంజలి, రామరాజు,కెమెరా – కూనపరెడ్డి జయకృష్ణ ,ఎడిటింగ్ – సుంకర ఎస్ ఎస్,లిరిక్స్ – సాహిత్య సాగర్, గిరి పట్ల ,నిర్మాత – కేఎన్ రావు ,నిర్మాణ నిర్వహణ – కే.ఆర్ ప్రశాంత్,రచన, సంగీతం, దర్శకత్వం – నరేష్ పెంట

- Advertisement -