టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌..

62
rcb

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్‌లో నేడు మరో కీలక పోరు జరగుతోంది. అబుదాబి వేదికగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఫామ్‌ పరంగా చూస్తే సన్‌రైజర్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. లీగ్‌ దశలో తప్పక గెలువాల్సిన మూడు మ్యాచ్‌ల్లో.. వరుసగా పాయింట్ల పట్టికలో టాప్‌-3 జట్లు ఢిల్లీ, బెంగళూరు, ముంబైను ఓడించిన హైదరాబాద్‌ ఆటగాళ్లు హ్యాట్రిక్‌ విజయాలతో ఫుల్‌జోష్‌లో ఉన్నా రు.

వరుసగా నాలుగు ఓటములతో నాలుగో స్థానానికి పడిపోయిన కోహ్లీసేన గట్టిగా పుంజుకోవాలని భావిస్తోంది. ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.