టీపీఎల్‌ నిర్వహణకు SRH సహకారం

3
- Advertisement -

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) నిర్వహించేందుకు సహకారం అందించాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు యాజమాన్యాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కి అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు కోరారు. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు యాజమాన్యంతో జరిగిన సమన్వయ సమావేశంలో జగన్‌మోహన్‌ రావు, ఉపాధ్యక్షుడు దల్జీత్‌ సింగ్‌, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రంలో క్రికెట్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎస్‌ఆర్‌హెచ్‌కు జగన్‌మోహన్‌ రావు విజ్ఞప్తి చేశారు. అలానే ఐపీఎల్‌ రద్దీను దృష్టిలో పెట్టుకుని ఉప్పల్‌లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి సహకారం కావాలని కోరారు. టీపీఎల్‌ నిర్వహణ, రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వైపు నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

ఉప్పల్‌లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ నిర్మాణంపై అంచనాలు రూపొందిస్తే వచ్చే ఏడాది పనులు ప్రారంభించేందుకు తమ వంతు సహాయం అందిస్తామని ఎస్‌ఆర్‌హెచ్‌ బృందం తెలిపింది. ఇక, ఇపీఎల్‌ టిక్కెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని, స్టేడియంలో తినుబంఢారాలను, శీతల పానియాలను సాధారణ రేట్లకే అమ్మాలని ఎస్‌ఆర్‌హెచ్‌ బృందంకు జగన్‌మోహన్‌ రావు సూచించారు. వచ్చే నెల 2వ తేదీన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు-ఎస్‌ఆర్‌హెచ్‌ బృందం సంయుక్తంగా ఐపీఎల్‌ ఏర్పాట్లపై స్టేడియం మొత్తాన్ని పరిశీలించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి సీఈఓ షణ్ముగం, డైరెక్టర్‌ కిరణ్‌, జీఎం శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ICC Champions Trophy 2025: పూర్తి షెడ్యూల్ ఇదే

- Advertisement -