వారెవ్వా బ్యాట్స్ మెన్స్ విలయ తాండవం, బౌలర్స్ వీరవిహారం.. ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డులు.. మ్యాచ్ అంటే ఇదిరా అనుకునేలా అభిమానులకు పైసా వసూల్.. ఇలా నిన్నటి మ్యాచ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భీకర ఫామ్ లో ఉంది. ఈ సీజన్ లోనే ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే అని భావించారంతా కానీ ఇదే సీజన్ లోనే అదే జట్టు ఆర్సీబీపై బ్రేక్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఏకంగా 287 పరుగులు చేసి మరో రికార్డు సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో), క్లాసేన్ (67), అభిషేక్ శర్మ(34), మర్క్రమ్ (32), సమద్ (37)..బ్యాటింగ్ లో వీరవిహారం చేశారు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ గతంలో చేసిన రికార్డ్ (277) బ్రేక్ అవడమే కాకుండా 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆర్సీబీ గట్టిగానే పోరాడినప్పటికి వరుసగా వికెట్లు పడడంతో 262 పరుగులు చేసి ఓటమి మూటగట్టుకుంది.
ఆర్సీబీ రికార్డ్
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఒకానొక ధశలో లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్ (62), దినేష్ కార్తీక్ (83) పరుగులతో రాణించినప్పటికి ఫలితం లేకపోయింది. అయితే చేధనలో 250 పరుగులకు పైగా (262) చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.
ఎస్‌ఆర్‌హెచ్ రికార్డులు
నిన్నటి మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ రికార్డులు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్ లో రెండు సార్లు అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డ్ తన పేరున లిఖించుకుంది. ప్రస్తుతం హయ్యెస్ట్ స్కోర్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో 277 ( ముంబై ఇండియన్స్ పై ), 287 ( ఆర్సీబీ పై ) సాధించిన జట్టుగా హైదరబాద్ నిలిచింది. అంతే కాకుండా నిన్నటి మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 22 సిక్సులు బాదిన జట్టుగా కూడా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది.
Also Read:ఆది పినిశెట్టి..ద్విభాషా చిత్రం ‘శబ్దం’