యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ కామెడీ రైడ్ ఆగస్ట్‌లో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈనేపథ్యంలో క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదలచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నటి శ్రీముఖి మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు. క్రేజీ కాంబినేషన్లు ఉన్నాయి. ఈ సినిమాలో నటీనటులందరు నా కెరీర్‌లో నాకు ఎక్కడో ఒక చోట పరిచయం ఉన్నవారే. మా అందరితో చాలా ఓపిగ్గా వర్క్ చేయించుకున్న దర్శకులు సత్తిబాబుకి, నిర్మాత అశోక్‌కి ధన్యవాదాలు తెలిపింది. శ్రేయాస్ శ్రీనివాస్ భవిష్యత్‌లో ఇలాంటి ఎంటర్‌టైనింగ్ మూవీస్‌తో పాటుగా, పెద్ద పెద్ద సినిమాలను కూడా నిర్మించాలని శ్రీముఖి అన్నారు.