శ్రీలీల గట్టిగా నాలుగు సినిమాలు కూడా చేయలేదు. అప్పుడే అమ్మడు స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. నిజానికి శ్రీలీల మొదటి సినిమా ‘పెళ్లిసందD’ సినిమా ప్లాప్. ఆ సినిమా హీరోకి కూడా మరో ఛాన్స్ లేదు. కానీ, శ్రీలీలకి మాత్రం ఆ సినిమా రిలీజ్ కి ముందే ఆమె కోసం హీరోలు పోటీ పడ్డారు. మొత్తానికి శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పైగా శ్రీలీల లో ప్రతిభ, లౌక్యం ఉన్నాయి. అందుకే ‘శ్రీలీల’ తెలుగు తెరపై చాలా త్వరగా తనదైన ముద్ర వేసింది.
ఎలాగూ ఆకర్షించే అందం, ఆకట్టుకునే నటన శ్రీలీల ను తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గర చేసింది. అన్నిటికీ మించి శ్రీలీల కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లే సినిమా తగిలినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందట. కాకపోతే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆ ఇద్దరి హీరోయిన్స్ లో శ్రీలీల కూడా ఒకరు. నిజానికి “పెళ్లిసందD” సినిమా హిట్ కానప్పుడు, ఎందరో హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు కాబట్టి.. శ్రీలీల కూడా మరుగు చాటుకి వెళ్లక తప్పదు అని టాక్ వినిపించింది.
Also Read: కన్నడ సాహిత్యానికే వన్నెలద్దిన గిరీష్ కర్నాడ్..
కారణం.. ఆమెలో హాట్ నెస్ తప్ప, యాక్టింగ్ లేదు అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. కానీ శ్రీలీల ఆ తర్వాత రవితేజ ధమాకాలో చూపించిన నటనకు మేకర్స్ కూడా షాక్ అయ్యారు. దెబ్బకు విమర్శకులు సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపించక తప్పలేదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా కూడా ఆమె చేతులోకి వచ్చింది కాబట్టి.. శ్రీలీల కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్టే.
Also Read: తలైవా రిటైర్ అవుతారా..!