వీడియో ఇదిగో..శ్రీలీలకు చేధు అనుభవం!

10
- Advertisement -

నటి శ్రీలీలకు చేధు అనుభవం ఎదురైంది. శ్రీలీల ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇటీవలే చిత్రబృందం డార్జిలింగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసింది. షూటింగ్ ముగిశాక శ్రీలీల కార్తిక్ ఆర్యన్‌తో కలిసి తిరిగి వెళ్తుండగా, స్థానిక అభిమానులు వారిని చుట్టుముట్టారు. సెక్యూరిటీ ఉండగానే కూడా, కొంతమంది అభిమానులు జనం మధ్య నుంచి శ్రీలీలను చేరుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమె చెయ్యిని పట్టుకుని లాగే ప్రయత్నం చేయగా అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సెక్యూరిటీ తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

 

Also Read:పవన్.. అడవితల్లి బాట

- Advertisement -